

ఈ రోజు టబు పుట్టిన రోజు. కింగ్ నాగార్జున తో కింగ్ 100 చేష్ట తెలుగు ప్రేక్షకులకి ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే పుట్టిన రోజు సందర్భంగా కింగ్ మేకర్స్ నుంచి రిలీజ్ చేసిన టబు వీడియోతో అభిమానులు, నెటిజెన్స్ టబు గురించి మాట్లాడుతున్నారు. ఈ టబు మ్యారేజ్ న్యూస్ కూడా ఆకర్షణీయమైన న్యూస్ రూపంలో అదనపు బోనస్ అని చెప్పవచ్చు.
ఈ అందాల తార ఇప్పటికీ అవివాహితగా ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన, మజిలీ గలిగిన కథ దాగి ఉంది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్న టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కారణమంటూ గతంలో టబు చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజ నటులు ‘విజయ్‌పథ్’ సినిమాతో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, ‘దృశ్యం’, ‘గోల్మాల్ అగైన్’, ‘భోలా’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కలిసి నటించారు. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ స్నేహితులుగా కొనసాగుతున్నారు.
అయితే, ఓ ఇంటర్వ్యూలో టబు తన పెళ్లి గురించి సరదాగా మాట్లాడుతూ అజయ్ దేవగణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను యువతిగా ఉన్న రోజుల్లో అజయ్ దేవగణ్, ఆయన కజిన్ సమీర్ కలిసి తనపై నిఘా పెట్టేవారని, తనతో మాట్లాడటానికి వచ్చే అబ్బాయిలను భయపెట్టి తరిమేసేవారని టబు నవ్వుతూ పంచుకున్నారు. “అప్పట్లో వాళ్లిద్దరూ పెద్ద రౌడీలా వ్యవహరించేవాళ్లు. నా చుట్టూ తిరుగుతూ నాతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బెదిరించేవాళ్లు. నేడు నేను ఇంకా సింగిల్‌గా ఉన్నానంటే అది పూర్తిగా అజయ్ దేవగణ్ వల్లే. అతను ఆ పనులకు భవిష్యత్తులోనైనా పశ్చాత్తాప పడాలని కోరుకుంటున్నాను అంటూ టబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ నవ్వించాయి.
ఇది కూడా చదవండి: నితిన్ నార్నె శస్త్రచికిత్స డీటెయిల్స్ ఇవే!

మరో సందర్భంలో అజయ్ దేవగణ్‌ను ఇదే ప్రశ్న అడగగా, ఆయన తనదైన శైలిలో మరింత హిలేరియన్గా స్పందించారు. టబుకి ఎలాంటి భర్త కావాలో చెప్పమని కోరగా… “టబుకి నేనే కావాలి, కానీ నేను ఆమెకు దక్కలేను” అంటూ చమత్కరించారు. ఆ తర్వాత దాన్ని క్లారిఫై చేస్తూ, తనలాంటి వ్యక్తిని ఆమె కోరుకుంటోందని, కానీ ఈ ప్రపంచంలో తనలాంటి మరొకరు లేరంటూ అజయ్ సరదాగా మాట్లాడారు.
[Ajay Devgn Reveals Why Tabu Never Got Married, Tabu marriage, Ajay Devgn, Tabu single status reason, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
