Home సినిమారామాయణం: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.! – ACPS NEWS

రామాయణం: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే రామాయణం ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా స్థాయిని పెంచేలా భారీ బడ్జెట్‌తో తెరిస్తే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా కూడా అలాంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా తన స్పందన తెలియజేశారు. ఈ సినిమా భారతీయ ప్రేక్షకులకు గొప్ప ప్రయత్నమని కొనియాడారు.

దిల్ రాజు తన పోస్టులో రామాయణం సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ”రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం మాకు కలగడం ఒక ఆశీర్వాదంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ అబ్బురపరిచారని కొనియాడారు.

అంతేకాదు.. ఈ సినిమాలో అద్భుతమైన చిత్రీకరణతో పాటు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. మనసుకు హత్తుకునే కథనం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతోందని తెలిపారు. ఇంతటి స్థాయిలో ఈ పురాణ కావ్యాన్ని ప్రదర్శించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున ట్రైలర్.. నాగార్జున ప్రజెంటేషన్‌లో కొత్త ప్రయోగం.!

[Ramayana Review By Dil Raju, Ramayana Movie, Ramayana Telugu Release, Dil Raju, Ranbir Kapoor, Sai Pallavi, Yash Ravana, Nitesh Tiwari, Namit Malhotra]

You may also like

Leave a Comment