Home సినిమాఅనిరుధ్ సక్సెస్ క్రెడిట్ ఆయనదే..! – iDreamPost – ACPS NEWS

అనిరుధ్ సక్సెస్ క్రెడిట్ ఆయనదే..! – iDreamPost – ACPS NEWS

by
0 comments
అనిరుధ్ సక్సెస్ క్రెడిట్ ఆయనదే..! - iDreamPost


ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ దాకా ఎక్కడ చూసినా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ గురించే ముచ్చట. ఆయన చేతిలో పడితే చాలు.. చిన్న సినిమా అయినా సరే పాటలు పిచ్చెక్కిపోవాల్సిందే, థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. అయితే సాక్షాత్తు రజినీకాంత్ ఫ్యామిలీకి దగ్గరి బంధువైన అనిరుధ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు? ఇంతటి స్టార్ కావడానికి అసలు ఎవరు కారణం? అన్నదానిపై సూపర్ స్టార్ పెద్ద కూతురు ఐశ్వర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ సినీ ఎంట్రీపై ఐశ్వర్య మాట్లాడుతూ.. “అనిరుధ్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండటం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆనాటి రోజులను గుర్తుచేసుకున్న ఐశ్వర్య.. ధనుష్ చేసిన సాయాన్ని బయటపెట్టారు. నిజానికి అనిరుధ్‌ని పైచదువుల కోసం సింగపూర్ పంపించాలని వాళ్ల అమ్మానాన్న గట్టిగా అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్‌లో ఉన్న అసాధారణమైన టాలెంట్‌ను ముందే పసిగట్టాడు. “వీడిలో మంచి సత్తా ఉంది, నన్ను నమ్మండి” అని వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడి, వాళ్లని ఒప్పించి మరీ ఇండియాలోనే ఆపేశాడు.

అంతేకాదు.. అనిరుధ్‌కి మొదటి కీబోర్డ్ కొనివ్వడం దగ్గర్నుంచి, ‘3’ సినిమాలో సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చే వరకు ప్రతీ విషయంలో ధనుషే ముందుండి నడిపించాడని ఐశ్వర్య తెలిపారు. అలా ధనుష్ నమ్మకమే అనిరుధ్ కెరీర్‌కు పునాది వేసిందని ఆమె చెప్పారు. అయితే ఇంతటి లైఫ్ ఇచ్చిన ధనుష్‌కు.. అనిరుధ్ పెళ్లిలో చోటు దక్కలేదంటూ తాజాగా నెట్టింట కొన్ని పోస్ట్‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనిరుధ్- కావ్య మారన్ వివాహానికి కోలీవుడ్‌లోని స్టార్‌లందరికీ ఆహ్వానాలు వెళ్లాయని, అయితే మొదటి బ్రేక్ ఇచ్చిన ధనుష్‌ను పక్కన పెట్టేశారని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment