Home సినిమారామాయణం..రేపే..! – iDreamPost – ACPS NEWS

రామాయణం..రేపే..! – iDreamPost – ACPS NEWS

by
0 comments
రామాయణం..రేపే..! - iDreamPost


మరి కొన్ని గంటలు. అత్యంత భారీగా నిర్మించిన రామాయణం సినిమా తెలుగు తెరమీదకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలా వుంటుంది..ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది మరో ఎత్తు. ఎందుకుంటే పౌరాణిక సినిమాలకు పుట్టిల్లు టాలీవుడ్. అన్ని భాషల్లో పౌరాణికాలు వచ్చినా మన నటుల ముఖకవళికలు సరిపోయినట్లు మిగిలన భాషల నటులు సరిపోలేదు అనేది మన ప్రేక్షకుల భావన. ఎన్టీఆర్ అంటే రాముడు ..రాముడు అంటే ఎన్టీఆర్ అనుకున్న నేల ఇది. ఆ తరువాత చాలా మంది రాముడి వేషం కట్టారు.

అందువల్ల తెలుగు జనాలను రాముడి వేషం కట్టి మెప్పించడం అంత సులువు కాదు. అదొక సమస్య. అది అలా వుంచితే రామాయణం సినిమాను తెలుగు నాట దిల్ రాజు విడుదల చేస్తున్నారు. పంపిణీ పరంగా కాస్త లో వున్నారు ఆయన. ఈ సినిమా మంచి హిట్ అయితే ఆయనకు, ఆయన సంస్థకు మంచి జోష్ వస్తుంది. ఇటీవలే టాక్సిక్ ను దిల్ రాజు విడుదల చేసారు. కెజిఎఫ్ సిరీస్ లా గట్టి హిట్ కొడతాం అనుకున్నారు. కానీ మిస్ ఫైర్ అయింది.

ఇప్పుడు రామాయణం ట్రయ్ చేస్తున్నారు. ఇది కనుక జనాలకు పట్టుకుంటే చాలా పెద్ద హిట్ అవుతుంది. పంపిణీనే కావచ్చు. కానీ మోరల్ గా దిల్ రాజు సంస్థకు గట్టి బూస్ట్ ఇస్తుంది. లేదంటే మాత్రం నిరాశ మిగులుతుంది. నవంబర్ లో రామాయణం, డిసెంబర్ లో వృషకర్మ, జనవరిలో విశ్వంభర ఇలా ప్రతి నెల పెద్ద సినిమాలు వున్నాయి ఆ సంస్థకు. ఈ లైనప్ ఇలా ముందుకు సాగాలంటే మంచి మోరల్ బూస్టప్ అవసరం. రామాయణం ఆ మేరకు సాయం చేస్తుందని ఆశించాలి.

రచయిత అవతార్

వి రాజా

You may also like

Leave a Comment