
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3-2 తేడాతో సిరీస్ గెలిచినా బౌలింగ్ విభాగం మాత్రం తీవ్ర ఆందోళన కలిగించింది. బ్యాటర్ల కారణంగా తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో జట్టులోని బౌలింగ్ విభాగంలో చర్చ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ పేసర్ భువన కుమార్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు.
తన యూట్యూబ్ ప్రకటనలో మాట్లాడిన ఇర్ఫాన్.. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున భువనేశ్వర్‌ను ఆడించడం కంటే యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇస్తే బాగుండేదని. భువనేశ్వర్ అనుభవజ్ఞుడైన బౌలర్ అని, అతడి స్కిల్స్ పై తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. అయితే, జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ పేసర్లకు ఈ సిరీస్‌లో అవకాశాలు కల్పించి ఉంటే, న్యూజిలాండ్‌లో విలువైన అనుభవం సంపాదించేవారని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో యువ బౌలర్లు తమను తాము నిరూపించుకోవడానికి ఇలాంటి టూర్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు. సమయంలో అవకాశాలు ఇవ్వకపోతే భవిష్యత్తు అవసరాలకు తగిన బౌలింగ్ వనరులను సిద్ధం చేయడం కష్టమవుతుందని హెచ్చరించాడు. అదే సమయంలో భువనేశ్వర్ ప్రదర్శనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. తొలి ఓవర్లలో బాగా బౌలింగ్ చేసినప్పటికీ, ప్లే ఓవర్‌లో పరుగులు సమర్పించుకోవడం వంటి చివరి పరిస్థితులు ఏ బౌలర్‌కైనా ఎదురవ పవర్ తెలిపాడు.

