Home సినిమాPocket Rockkets Teaser: గ్యాంబ్లింగ్ స్టోరీతో నిహారిక మరో కొత్త ప్రయత్నం.! – ACPS NEWS

Pocket Rockkets Teaser: గ్యాంబ్లింగ్ స్టోరీతో నిహారిక మరో కొత్త ప్రయత్నం.! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


నిర్మాతగా నిహారిక కొణిదెల వరుసగా కొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’, ‘రాకాస’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పాకెట్ రాకెట్స్’ సినిమా తీస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు యువకులు.. రిచ్ క్లాస్ మేట్ ఇచ్చిన డబ్బులు తీసుకొని శ్రీలంకకు వెళ్తారు. డబ్బు సంపాదించేందుకు గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారి జీవితాలు ఎలా మారిపోయాయి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మతో పాటు కొత్త నటుడు నిర్మల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంత హీరోయిన్ గా కనిపించనుంది. ఇక జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నిహారిక కొణిదెలకు నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావడం విశేషం. ఆ తర్వాత ‘రాకాస’తోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ కథను ఎంచుకున్నారు.

రుద్ర అత్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్ మళ్ళీ వచ్చింది.. ఈసారి అంతకు మించి.!

[Pocket Rockkets Teaser, Pocket Rockkets Movie, Niharika Konidela, Pink Elephant Pictures, Trinadh Varma, Nirmal, JD Chakravarthy, Telugu Cinema News]

You may also like

Leave a Comment