

పెను తుపాను ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటిన తరువాత కూడా దాని బీభత్సం కొనసాగుతోంది. అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తుపాను కారణంగా రాష్ట్రంలోని జిల్లాలలో ఏడుగురు మరణించారు. విశాఖ పాత గోశాల, బాలాజీనగర్‌లో విద్యుత్ స్తంభాలు కూలి ఇద్దరు మహిళలు, భీమవరంలో చెట్టు కూలి ఒకరు, విద్యుత్ స్తంభం విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు. తుఫాను ఘటనల్లో కోనసీమలో ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు మృతి చెందారు.
కాగా ఈ పెను తుపాను ధాటికి తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ సమాచారం ప్రకారం 31 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావం కారణంగా ఏపీలో దాదాపు 714 గ్రామాలు ప్రభావితమయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 57 వేలని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చాలా మంది ఉన్నారు. ప్రాణ నష్టాన్ని అధికారులు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సురక్షిత ప్రాంతాలకు చూస్తున్నారు.

సహాయ చర్యలలో 39 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించింది. ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లు, రోడ్లపై కూలిన చెట్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించే పనులను రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.
[Cyclone Arnab Effect Seven Killed Andhra Pradesh, NDRF, CDRF Teams AP, AP Heavy Rains, Cyclone Death Toll, Telugu One]
