Home Latest Newsఈవీఎంలే కాదు బ్యాలెట్ కూడా: ఓటమిపై జగన్ స్పందన.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజనులు.! | జగన్ ఈవీఎం ఆరోపణలు మరియు బ్యాలెట్ ఎన్నికలు | స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ | వైసీపీ ఓటమి – ACPS NEWS

ఈవీఎంలే కాదు బ్యాలెట్ కూడా: ఓటమిపై జగన్ స్పందన.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజనులు.! | జగన్ ఈవీఎం ఆరోపణలు మరియు బ్యాలెట్ ఎన్నికలు | స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ | వైసీపీ ఓటమి – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

ఏపీ మునిసిపోల్స్ ఫలితాలు జగన్ కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. 2024 ఎన్నికలలో ఓటమి నాటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఏదో జరిగింది. ఏవీఎంల కారణంగానే ఓడిపోయాను కానీ జనం నావెంటే ఉన్నారని చెప్పుకున్న జగన్, ఈ ఓటమికి కూడా దాదాపు అదే కారణం. అయితే తేడా ఏంటంటే ఏపీ మునిసిపోల్స్ బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి.

దీంతో ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్‌లో పరాజయంపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2024 ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే కారణమని, బ్యాలెట్ పేపర్ల ద్వారా ప్రజలు తమను భారీ సంఖ్యలో గెలిపిస్తారంటూ జగన్ అప్పట్లో జగన్ పదే పదే చెప్పారు తాజాగా ఎలాంటి ఈవీఎంల ప్రమేయం లేకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన పురపోరులోనూ జనం వైసీపీకి పరాజయం అందించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 151 స్థానాల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిన తర్వాత, మీడియా ముందుకు వచ్చిన జగన్ ఈవీఎంల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో గుర్తించారు, ఈవీఎంలలో ఏదో మతలబు ఉందని ఆరోపిస్తూ, అయితే ఏం చేస్తాం నా వద్ద ఆధారాలు లేవంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. బ్యాలెట్ విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రజలు వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన మునిసిపోల్స్ లో కూడా జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఎన్నికల మున్సిపల్న్నీ పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. ఎక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు తావులేకుండా ఓటర్లు నేరుగా బ్యాలెట్ పేపర్లపై తమ అభ్యర్థులకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే జగన్ ఎప్పుడైతే ట్యాంపరింగ్ లేని పద్ధతిగా భావించారో, అదే బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరగడం విశేషం. ఎలాంటి ట్యాంపరింగ్ ఆస్కారం లేని ఈ ఎన్నికల్లో ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పును వెలువరించారు. దీనితో జనం ఎటువైపు ఉన్నారన్నది తేటతెల్లమైంది.

ఓ పక్క మునిసిపోల్స్ ఫలితాలు వెలువడగానే.. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు గుప్పిస్తూ, జగన్ బ్యాలెట్ విధానంపై వ్యాఖ్యలు, అప్పటి వీడియోలను నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈవీఎంల వల్లనే ఓడిపోయామని గతంలో వాదించిన నేత, ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే వాటిని వేటినీ పట్టించుకోని జగన్ ఈ ఎన్నికలను సెలక్షన్స్ గా అభివర్ణిస్తూ.. టీం చంద్రబాబుకు కంగ్రాట్స్ అంటూ ఎన్నికల సంఘం, పోలీసులను ట్యాగ్ చేశారు. ఆత్మ విమర్శకు బదులు పర నిందతో తనను తాను జగన్ మభ్య పెట్టుకోవడమే కాకుండా, ప్రజలనూ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


[Jagan EVM Allegations And Ballot Eections, Local Body Elections,  Andhra Pradesh, YCP defeat, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment