
స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలతో పాటు ఇంటి అవసరాలకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువస్తున్న షావోమీ తాజాగా మరో కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి తీసుకొచ్చింది. మిజియా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ 2 ప్రో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ను చైనాలో విడుదల చేసింది. సాధారణ టూత్‌బ్రష్‌లా కాకుండా ఇందులో కలర్ డిస్‌ప్లే ఇచ్చారు. పళ్లు తోముకునే సమయంలో ఎంతసేపు బ్రష్ చేశారు? నోటిలో ఏయే భాగాలను శుభ్రం చేశారు? ఇంకా ఎక్కడైనా శుభ్రం చేయాలి? వంటి వివరాలను ఈ స్క్రీన్‌పై చూడొచ్చు. కొత్త సోనిక్ వైబ్రేషన్ మోటార్ 2.0, అప్‌లో చేసిన బ్రష్ హెడ్ కూడా ఉన్నాయి.
షావోమీ కొత్త టూత్ బ్రష్ ధర ఎంత?
మిజియా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ 2 ప్రో అసలు ధర 249 చైనా యువాన్లు. భారత కరెన్సీలో సుమారు రూ.3,500 అవుతుంది. అయితే క్రౌడ్‌ఫాండింగ్ విక్రయాల్లో భాగంగా ప్రారంభ ధరను 179 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2,500కే లభించనుంది. అయితే ఈ ధర చైనాలోని క్రౌడ్‌ఫండింగ్ ఆఫర్‌కు సంబంధించినది. భారత్‌లో ఈ టూత్‌బ్రష్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై షావోమీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇతర దేశాల్లో విక్రయాల వివరాలు కూడా వెల్లడించలేదు.
కొత్త మోటార్‌తో మెరుగైన శుభ్రత
ఈ టూత్‌బ్రష్‌లో సోనిక్ వైబ్రేషన్ మోటార్ 2.0ను ఉపయోగించారు. పళ్లపై పేరుకుపోయే ప్లాక్‌ను తొలగించడంలో ఈ మోటార్ సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బ్రషింగ్ మోడ్‌లకు అనుగుణంగా వైబ్రేషన్ పద్ధతులు పనిచేస్తాయి. బ్రష్ హెడ్ను కూడా అప్ చేశారు. ఇందులో సాఫ్ట్ రబ్బర్‌తో తయారు చేసిన ప్రత్యేక షాక్ అబ్జార్బింగ్ నిర్మాణం ఉంది. బ్రష్ చేసేటప్పుడు పళ్లకు గట్టిగా తగలకుండా ఈ డిజైన్ కోసం రూపొందించిన కంపెనీ. ఫ్లెక్సిబుల్ నిర్మాణం వల్ల పళ్ల ఆకారానికి అనుగుణంగా బ్రష్ వెంట్రుకలు సర్దుబాటు అవుతాయి.
ఇది కూడా చదవండి: చెప్పిన పనులు చేసే ఫోన్
ఎక్కడ శుభ్రం చేయలేదో స్క్రీన్‌పై అలర్ట్
ఈ టూత్‌బ్రష్‌లోని కలర్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. బ్రష్ చేస్తున్న సమయంలోనే శుభ్రం చేసిన భాగాలు, బ్రషింగ్ సమయం వంటి వివరాలను చూపుతుంది. నోటిలో ఏదైనా శుభ్రం చేయడం, మరిచిపోయినా తగినంత సమయం కేటాయించకపోయినా స్క్రీన్‌పై అలర్ట్ కనిపిస్తుంది. ఇందులో డిఫాల్ట్ బ్రషింగ్ సెషన్ నాలుగు నిమిషాలు ఉంది. అంతేకాదు, టూ-వే ప్రెషర్ అలర్ట్ సదుపాయం కూడా ఇచ్చారు. పళ్లపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టినా, తక్కువ ఒత్తిడితో బ్రష్ చేసినా ఇంటికేటర్ లైట్ సమాచారం అందుతుంది. ఎక్కువ ఒత్తిడి పెడితే వైబ్రేషన్ వేగాన్ని ఆటోమెటిక్‌గా తగ్గిస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 190 రోజుల బ్యాటరీ
బ్యాటరీ విషయంలోనూ షావోమీ ప్రత్యేకత చూపించింది. మిజియా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ 2 ప్రోను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 190 రోజుల వరకు ఉపయోగించని కంపెనీ ప్రకటించింది. ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్ ఇచ్చారు. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు ఆరు గంటలు పడుతుంది. ఇక నీటిని తట్టుకునే సామర్థ్యం కోసం IPX8 రేటింగ్ కూడా ఉంది. కాబట్టి బ్రష్‌ను నీటితో కడిగి శుభ్రం చేసుకోవచ్చు. కలర్ స్క్రీన్, ప్రెషర్ అలర్ట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త టూత్‌బ్రష్ భారత్‌లోకి వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

