
నిత్యా మీనన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సహజమైన నటన, అందమైన చిరునవ్వు, వైవిధ్యమైన పాత్రలు. ఎలాంటి పాత్ర ఇచ్చిన తనదైన నటనతో మెప్పించగల ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్ హీరోగా నటిస్తున్న హిందీ సినిమా ‘మిస్టర్ అండ్ మిస్సెస్ గ్రే’లో నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆమె పాత్రపై ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తే ఒకరోజు ప్రాణాలకు ముప్పుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో కథ సాగనుంది. పోస్టర్లో వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ముఖాలు సగం మాత్రమే కనిపించేలా చూపించారు. వారి లుక్‌లో కనిపిస్తున్న సీరియస్‌నెస్, సస్పెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. నిత్యా పాత్రలో ఊహించని మలుపులు ఉంటాయని ప్రచారం. మరి ఆమె నిజంగానే విలన్‌గా కనిపిస్తారా? లేక కథలో మరో రహస్యం దాగి ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేవ్బ్యాండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం ఈ సినిమా దాదాపుగా మూడేళ్లుగా రూపొందించబడింది. ఈ చిత్రంతో వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. గతంలో ‘మిషన్ మంగళ్’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నిత్య.. ఇప్పుడు మరోసారి హిందీ సినిమాలో కనిపించబోతున్నారు.
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 11న ఈ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రేమ, నమ్మకద్రోహం, మోసం చుట్టూ తిరిగే ఈ మర్డర్ మిస్టరీలో నిత్యా మీనన్ పాత్ర ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటివరకు నిత్యకు భిన్నంగా ఈ సినిమాలో ఆమెను చూడబోతున్నామా? అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
[Nithya Menen Villain Role, Mr and Mrs Grey Movie, Nithya Menen New Movie, Vivek Oberoi Nithya Menen, Mr and Mrs Grey First Look, Nithya Menen Bollywood Comeback, Mr and Mrs Grey Release Date, Murder Mystery Thriller]
