Home Latest Newsఅమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.! | US మధ్యంతర ఎన్నికలు 2026 | డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల ఓటమి | US సెనేట్‌ను డెమొక్రాట్లు నియంత్రిస్తారు | US కాంగ్రెస్ రాజకీయ మార్పులు – ACPS NEWS

అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.! | US మధ్యంతర ఎన్నికలు 2026 | డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల ఓటమి | US సెనేట్‌ను డెమొక్రాట్లు నియంత్రిస్తారు | US కాంగ్రెస్ రాజకీయ మార్పులు – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా మధ్యంతర ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. అహంకారం, ఏకపక్ష నిర్ణయాలతో ఆయన చూపిస్తున్న ఆధిపత్య ధోరణికి అమెరికాను చెక్ పెట్టారు. అమెరికన్ పాలిటిక్స్ లో కీలకంగా కోరుకునే మధ్యంతర ఎన్నికల ఫలితాలు అక్కడి రాజకీయ రాజకీయ సమీకరణలను సమూలంగా మార్చే దిశగా సాగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగా, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ బలంగా పుంజుకుంది. ముఖ్యంగా సెనెట్‌పై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ప్రతినిధుల సభలోనూ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. రెండో ట్రంప్ దఫా పాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తికాకముందే వెలువడిన ఈ తీర్పు అమెరికా రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ క్రియోట్ చేస్తోంది.

మంగళవారం (నవంబర్ 3) జరిగిన ఈ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 435 మంది ప్రతినిధుల సభ స్థానాలకు, 35 సెనెట్ స్థానాలకు అలాగే 36 రాష్ట్రాల గవర్నర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇమ్మిగ్రేషన పాలసీలు, వాణిజ్య సుంకాలు అమెరికన్లలో ట్రంప్ పాలన పట్ల అసహనం, ఆగ్రహం కలిగించిన ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు విస్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా పెచ్చరిల్లిన ఆర్థిక భారం ట్రంప్ నాయకత్వం, రిపబ్లికన్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకతగా ప్రోది అయ్యిందని ఫలితాల ప్రాథమిక ట్రెండ్ తేటతెల్లం చేస్తోంది.

సెనెట్ పోరులో డెమోక్రాట్లు చరిత్రాత్మక విజయాలను నమోదు చేసి ఆధిపత్యాన్ని దక్కించుకున్నారు. నార్త్ కరోలినాలో మాజీ గవర్నర్ రాయ్ కూపర్ రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ వాట్లీపై ఘన విజయం సాధించగా, జార్జియాలో జోన్ ఒసాఫ్ తిరిగి ఎన్నికయ్యారు. అలాగే న్యూ హాంప్‌షైర్‌లో క్రిస్ పప్పాస్ గెలుపొందగా, టెక్సాస్‌లో జేమ్స్ తలారికో, ఒహియోలో షెరాడ్ బ్రౌన్ విజయాలు సాధించారు. ఈ ఫలితాలు నిస్సందేహంగా రిపబ్లికన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ విజయాలతో సెనెట్‌లో డెమోక్రాట్‌లకు స్పష్టమైన ఆధిక్యత లభించింది.

ఇక ప్రతినిధుల సభలోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయాల దిశగా దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న పలు కీలక స్థానాలను కైవసం చేసుకుంటూ మెజారిటీ మార్కుకు చేరువయ్యారు. మొత్తం 435 స్థానాలున్న సభలో సభపై పట్టు సాధించాలంటే 218 సీట్లు అవసరం కాగా, కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగేందుకు తుది తుది సంఖ్యపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఇక పోతే గవర్నర్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు సత్తాను చాటుకున్నారు. టెక్సాస్‌లో గినా హినోజోసా విజయం సాధించి ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలి లాటినా గవర్నర్‌గా రికార్డు సృష్టించారు. జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్, ఒహియోలో అమీ ఆక్టన్, ఐవోవాలో రాబ్ సాండ్, కాలిఫోర్నియాలో జేవియర్ బెసెరా విజయం సాధించారు. సాంప్రదాయకంగా రిపబ్లికన్ల అడ్డాలుగా భావించే రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు గెలుపు బాటలో ఉన్నారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణ కఠినతరం అవుతుంది. దేశ ప్రతిపక్ష బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ కీలక నియామకాలు, విదేశీ విధానాలు, అలాగే ట్రంప్ పాలనా నిర్ణయాలపై అవకాశం నుంచి గట్టి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వలసదారులపై తీవ్ర ప్రభావం చూపే హెచ్‌హెచ్‌ 1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల జారీ, టాక్స్ టెర్రర్, ఇండియన్ టెక్కీల ఉద్యోగ అవకాశాలపై ఈ రాజకీయ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా చూస్తే, 2026 మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా నిలిచాయి. 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు వెలువడిన ఈ తీర్పు, ట్రంప్ పాలనా, శైలిపై అమెరికన్ల ఆగ్రహానికి తాకనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

[US Midterm Elections 2026, Donald Trump Republicans defeat, Democrats control US Senate, US Congress political changes, TeluguOne political news]

You Might Also Like

You may also like

Leave a Comment