
ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీ రంగంలో ఏఐ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆఖరికి వైద్య రంగంలోనూ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, కొంతమంది ప్రజలు తమ ఆరోగ్య సమస్య విషయంలో ఏఐ సలహా తీసుకుని కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, అమెరికాలో ఓ యువతి చాట్‌జీపీటీ సలహా పాటించి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని సియాటెల్‌కు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మూర్చ రోగంతో బాధపడుతోంది. డాక్టర్ల సలహా మేరకు మందులు కూడా వాడుతోంది. మందులు వాడే విషయంలో ఆమె చాట్‌జీపీటీ సలహా తీసుకుంది. చాట్‌జీపీ ఆమెకు 25 రోజుల మెడిసిన్ షెడ్యూల్ వేసి ఇచ్చింది. 25 రోజుల తర్వాత మెడిసిన్ మానేయమని చెప్పింది. ఆమె చాట్‌జీపీటీ చెప్పినట్లు చేసింది. దీంతో ఆమెకు మూర్చ వచ్చే లక్షణాలు కనిపించాయి. ఆమె ఇదే పరీక్ష చాట్‌జీపీటీకి చెప్పింది.
ఏమీ కాదని చాట్‌జీపీటీ భరోసా ఇచ్చింది. అయితే, అనుకోని విధంగా ఆ యువతికి ఎపిలిప్సీ వచ్చింది. దీంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన గత ఫిబ్రవరి నెలలో జరిగింది. అక్టోబర్ 27వ తేదీన యువతి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. చాట్‌జీపీటీ సలహా కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని కోర్టులో కేసు వేశారు. ఓపెన్ఏఐతో పాటు దాని సీఈఓ సామ్ ఆల్ట్‌మ్యాన్‌పై వారు లా సూట్ వేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి మరి.

